Skip to main content

Namaste NRI

న్యూయార్క్‌లో మహ్మాతుడికి మళ్లీ…

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.  దీన్ని విద్వేషపూరిత ఘటనగా భావిస్తున్నారు. సౌత్‌ రిచ్‌మండ్‌ హిల్‌లోని శ్రీతులసీ మందిర్‌ ముందు ఉన్న గాంధీజీ విగ్రహంపై ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 16న దాడి చేసినట్లు న్యూయార్క్‌ సిటీ పోలీసు విభాగం  తెలిపింది. తొలుత ఓ వ్యక్తి సుత్తితో విగ్రహాన్ని కొట్టినట్లు నిఘా కెమెరాల్లో రికార్డయింది. కొద్ది నిమిషాలకు మరికొందరు వచ్చి ధ్వంసం చేసినట్లు తెలిసింది.  అనంతరం దుండుగులు రెండు వాహనాల్లో పారిపోయినట్లు పోలీసు విభాగం తెలిపింది. వారిని పట్టుకునేందుకు సహకరించాలని ప్రజలను కోరింది. 25 నుంచి 30 ఏండ్లలోపు ఉన్న వ్యక్తులు విధ్వంసకాండకు పాల్పడినట్లు అక్కడి సీసీ కెమెరాలలోని వీడియలో స్పష్టం అయింది. ఘటన తరువాత దుండగులు అక్కడి నుంచి కిరాయికి తీసుకుని వచ్చిన మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో ఉడాయించారని పోలీసులు తెలిపారు. గాంధీజీ విహ్రాన్ని ధ్వంసం చేసిన ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండిరచింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ ఈ విషయాన్ని అమెరికా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events