Namaste NRI

ప్రపంచ దేశాల కన్నా.. ముందు మన దేశంలో

ప్రపంచ దేశాలను చక్కదిద్దడం కన్నా ముందు మన దేశంలోని స్కూళ్లను పిల్లలకు సురక్షితంగా ఉండేలా మార్చుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికాకు చెందిన నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ హూస్టన్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు నిధులను ఇవ్వడం కాదు, దేశంలోని స్కూళ్లలో భద్రతను  పెంచేందుకు నిధులను కేటాయించాలని అన్నారు. ఉక్రెయిన్‌కు బిలియన్ల్‌ డాలర్లను ఇవ్వగలిగినప్పుడు, మన ఇంట్లో మన పిల్లల్ని సురక్షితంగా ఉంచేందుకు కూడా చర్చలు చేపట్టాలన్నారు.  ఇరాక్‌, ఆఫ్గనిస్తాన్‌లో ట్రిలియన్ల డాలర్లను ఖర్చు చేశామని, కానీ అక్కడ ఏమీ లభించలేదని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events