Skip to main content

Namaste NRI

పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభం

రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా నటిస్తున్న పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ, రాజరాయ్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు చందు మొండేటి క్లాప్‌నివ్వగా, ప్రసన్నకుమార్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్‌, యాక్షన్‌, డ్రామా కలబోసిన కథాంశమిది. ఏప్రిల్‌ 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం అన్నారు.  హీరో రక్షిత్ మాట్లాడుతూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. ఒక మంచి టీమ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.  ప్రొడ్యూసర్ మాట్లాడుతు విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ మా డైరెక్టర్ గారు ఒక కొత్త కాన్సెప్ట్ తో సరి కొత్త కధాంశం తో చిత్రాన్ని నిర్మిస్తామని ఒక మంచి సినిమా స్టోరీ చాల బాగుంది. త్వరలో మిగతా నటీనటులు వివరాలు మరియు సాంకేతిక నిపుణల వివరాలు తెలియియజేస్తాను అని చెప్పారు . ఈ కార్యక్రమంలో యు అండ్ ఐ అధినేత పద్మనాభ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events