వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను మార్చేందుకు చైనా ఏకపక్ష ప్రయత్నాన్ని కూడా భారత్ అనుమతించబోదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు పెరుగుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై కేంద్రం అధికారిక వైఖరిని కోరుతూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వాస్తవాధీన రేఖపై యథాతథ స్థితిని మార్చడానికి చైనా ఏకపక్ష ప్రయత్నమేమీ చేయకుండా చూసుకోవడంలో వేము చాలా స్పష్టంగా, చాలా ప్రభావవంతంగా ఉన్నాం అని తెలిపారు. 1962లో లఢఖ్‌తో సహా భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవడం వల్ల ఆ దేశంతో సరిహద్దుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిలో వ్యూహాత్మక ప్రాంతాలు భారత సరిహధ్దు దళాలకు సవాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.














