Skip to main content

Namaste NRI

భారత్ మరో మైలు రాయి

భారత్‌ లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జోరుగా కొనసాగుతుంది.  కరోనా వ్యాక్సినేషన్‌ మన దేశం మరో మైలురాయిని చేరుకుంది. దేశంలో 75 శాతానికి పైగా అర్హులైన జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌. దేశంలో 75 శాతానికి  పైగా అర్హులైన ప్రజలకు పూర్తి వ్యాక్సినేషన్‌ జరిగింది. అందరి కృషితో కొవిడ్‌ 19ను ఓడిస్తాం అని మాండవీయ తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఈ మైలురాయి చేరుకున్నందుకు ఆయన దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. మన టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నావారి పట్ల గ్వరంగా ఉందని పేర్కొన్నారు.

                        గతేడాది జనవరిలో భారత్‌లో టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 127 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. 47.9 కోట్ల మందికి రెండు డోసులు, 80 కోట్ల మంది మొదటి డోసు వేయించుకున్నారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఒక్కరోజే కోటికిపైగా డోసులు ప్రజలకు అందాయి. 127.66 కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో 84.4 మంది ఇప్పటి వరకు కనీసం ఒక డోసు తీసుకున్నారని వివరించింది. ఇప్పటి వరకు 47.59 కోట్ల మంది రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events