Namaste NRI

అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారిగా భారతీయ అమెరికన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో భారతీయ అమెరికన్‌ రషద్‌ హుస్సేన్‌ను అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్‌గా నామినేట్‌ చేశారు. ఈ పదవికి ఎంపికైన తొలి ముస్లింగా రషద్‌ నిలిచారు. రషద్‌ హుస్సేన్‌ జాతీయ భద్రతా మండలిలో భాగస్వామి, అలాగే గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ డైరెక్టర్‌. ఆయన గతంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ నేషనల్‌ సెక్యూరిటీ డివిజన్‌లో సీనియర్‌ కౌన్సెల్‌గా పనిచేశారని వైట్‌ హౌస్‌ ప్రకటనలో పేర్కొంది. ఒబామా హయాంలో స్ట్రాటజిక్‌ కౌంటర్‌ టెర్రరిజం కమ్యూనికేషన్స్‌, డిప్యూటీ అసోసియేట్‌ వైట్‌ హౌస్‌ కౌన్సిల్‌ కోసం ఇస్లామిక్‌ కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌కు అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా రషద్‌ సేవలందించారు.

                రాయబారిగా హుస్సేన్‌ విద్య, వ్యవస్థాపకత, ఆరోగ్యం, అంతర్జాతీయ భద్రత, సైన్స్‌, టెక్నాలజీ, ఇతర రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఇస్లామిక్‌ సహకారం, ఐక్యరాజ్యసమితి, విదేశీ ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థల్లోనూ పని చేశారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో చేరడానికి ముందు ఆరో సర్క్యూట్‌ యూఎస్‌ అప్పీల్స్‌ డామన్‌ కీత్‌కు జ్యుడీషియల్‌ లాక్లర్క్‌గా పనిచేశాడు. ఒబామా బిడెన్‌ ట్రాన్సిషన్‌ ప్రాజెక్ట్‌కి అసోసియేట్‌ కౌన్సెల్‌గా కూడా ఉన్నారు. హుస్సేన్‌ యేల్‌ లా స్కూల్‌ నుంచి లా డిగ్రీ.. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి అరబిక్‌, ఇస్లామిక్‌ అధ్యయనాలు చేసి మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. రషద్‌ నియామకంపై  అమెరికన్‌ యూదు కమిటీ యునైటెడ్‌ స్టేట్స్‌ అంబాసిడర్‌గా నియమించినందుకు బిడెన్‌ పరిపాలనను ప్రశంసించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events