Namaste NRI

భారత ఎంబసీ కీలక ప్రకటన

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక ప్రకటన చేసింది. టూరిస్ట్‌ వీసాలు (మల్టీపుల్‌ ఎంట్రీ వీసాలతో సహా) కావాలనుకునే కువైటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రయాణ ఆంక్షలను తొలగించిన నేపథ్యంలో టూరిస్ట్‌ వీసాలను జారీ చేసేందుకు సిద్ధమైనట్లు ఎంబసీ వెల్లడిరచింది. పర్యాటక వీసాల కోసం అవసరమైన ధృవపత్రాలు, వీసా రుసుముతో ఎంబసీకి చెందిన బీఎల్‌ఎస్‌ ఇంటర్నెషనల్‌ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే దరఖాస్తుదారు స్వయంగా బీఎల్‌ఎస్‌ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.  ఎందుకంటే.. దరఖాస్తుదారు ఫొటో, బయోమెట్రిక్‌ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. కువైట్‌ సిటీలోని అలీ అల్‌ సలేం స్ట్రీట్‌ జవహార్‌ టవర్‌ మూడో అంతస్తులోని బీఎల్‌ఎస్‌ కేంద్రంలో దరఖాస్తు సమర్పించాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events