Namaste NRI

ఒమన్‌లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

 75వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఒమన్‌ దేశంలోని మస్కట్‌ సీబ్‌ మబేలా మస్కట్‌ మున్సిపాలిటీ క్యాంపులో ఘనంగా నిర్వహించారు. కొత్త చిన్నయ్య, గాంధారి నరేష్‌ ఆధ్వర్యంలో  కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఒమన్‌ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు షేక్‌ అహ్మద్‌, తాటి కొండయ్య నర్సయ్య పాల్గొని ప్రసంగించారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత అని అన్నారు.

                ఈ కార్యక్రమంలో పోషన్న, సురేష్‌, నాని, రాంబాబు, గణేష్‌, వర్షరాములు, రాజు, సాయగౌడ్‌, సుభాష్‌, రమేష్‌, వంశీ, రాజు, దినేష్‌, ఎల్లయ్య, శంకర్‌, నవీన్‌, ఆనంద్‌, భూమేష్‌, వేణు, కొల్లపురం రాములు, జంబుక శ్రీనివాస్‌,  జోగపూర్‌ శ్రీనివాస్‌, నరేష్‌, వెంకటేష్‌, రమేష్‌, జగన్‌, తెడ్డు కార్తీక్‌, కాశిరాం, పవన్‌,  మేడిపట్ల లక్ష్మణ్‌, బుడ్డల గంగాధర్‌, మెరుగు జగన్‌, రాజ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, బొడ్డుల కృష్ణ, కౌడపు దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News