Skip to main content

Namaste NRI

ఓపెన్‌ ఏఐ కీలక పదవిలో భారత సంతతి టెకీ

ṣభారత సంతతికి చెందిన ప్రముఖ టెక్‌ నిపుణుడు ఉదయ్‌ రుద్దరాజు ఏఐ(కృత్రిమమేధ) రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న ఓపెన్‌ ఏఐలో కీలక పదవికి ఎంపికయ్యారు. కంపెనీలో ఒక సంవత్సరంపాటు హెడ్‌ ఆఫ్‌ కంప్యూట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో) ఆఫ్‌ కంప్యూట్‌ గా ప్రమోట్‌ చేసినట్టు ఓపెన్‌ ఏఐ ప్రకటించింది. సీటీవోగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని ఉదయ్‌ తెలిపారు.

హైదరాబాద్‌లోని చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (సీబీఐటీ)లో బీఈ కంప్యూటర్‌ సైన్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటాలో కంప్యూటర్‌సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఉదయ్‌, ఈబే, రాబిన్‌హుడ్‌ సంస్థల్లో దాదాపు చెరో ఆరేళ్లపాటు పనిచేశారు. అనంతరం మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐలో చేరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతిగా సేవలందించారు. ఎక్స్‌ఏఐలో 2.5 లక్షల జీపీయూలతో కొలోసస్‌ సూపర్‌ కంప్యూటర్‌ను రూపొందించిన బృందానికి నాయకత్వం వహించింది ఉదయ్‌ రుద్రరాజే. ఆ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ మోడల్‌ గ్రోక్‌ 3కి శిక్షణ ఇవ్వడంలో కూడా కీలకపాత్ర పోషించారు. గత ఏడాది జూలైలో ఆ సంస్థను వీడి ఓపెన్‌ఏఐలో చేరారు.

Social Share Spread Message

Latest News