Namaste NRI

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ హాస్పిటల్స్ సీఈవోగా భారత సంతతి మహిళా 

భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ మేఘనా పండిట్ యూకేలో ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్‌హెచ్‌ఎస్‌  ఫౌండేషన్ ట్రస్టు సీఈవోగా నియమితులయ్యారు. మొదటి మహిళా సీఈవోగా నియమితురాలైన మేఘన మార్చి 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.  బ్రిటన్‌లోనే  అతిపెద్ద టీచింగ్ హాస్పిటల్‌గా  పేరొందిన ఆక్స్‌ఫర్డ్‌  యూనివర్సిటీ హాస్పిటల్స్ (ఓయూహెచ్)లో మేఘన గత ఏడాది జూలై నుంచి తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆమె అర్హతలు, అంకితభావం చూసి ఆమెను సీఈవోగా నియమించాలని నియామక ప్యానల్ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు హాస్పిటల్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Social Share Spread Message

Latest News