Skip to main content

Namaste NRI

బోస్టన్‌లో భారతీయులు సంబరాలు

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలను విదేశాల్లో స్థిరపడిన భారతీయులు సైతం ఘనంగా జరుపుకున్నారు. అమెరికాలోని బోస్టన్‌ నగరంలోని ప్రవాస భారతీయులు వినూత్నంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఆకాశంలో అమెరికా, భారత్‌ పతాకాలు ఎగరేస్తూ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాకు ఎంతగానో నచ్చింది. దీనితో ఆయన ట్విట్టర్‌లో పేజీలో షేర్‌ చేశారు. వాస్తవానికి ఈ వీడియోను తొలుత నిర్మాత అశోక్‌ పండిట్‌ పోస్ట్‌ చేశారు. ఒక చిన్నపాటి విమానం అమెరికా, భారత్‌ పతకాలను తీసుకెళుతున్నట్లుగా ఉంది. నేను 1973లో బోస్టన్‌లో కాలేజీ చదువు ఆరంభించినప్పుడు భారత జనాభా చాలా తక్కువగా ఉండేది. ఒకే ఒక భారత రెస్టారెంట్‌  ఉండేది. భారత్‌లో పులులు, పాములు గురించి సహచర విద్యార్థులు అడిగేవారు. ఈ గర్వకారణమైన సన్నివేశాన్ని చూసి నేను ఎంతగానో ఆనందించాను అంటూ ఆనంద్‌ మహీంద్రా ట్విట్‌ చేశారు.

Social Share Spread Message

Latest News