Namaste NRI

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనను శిక్షించాలి : జెలెన్‌స్కీ

 యుద్ధ నేరారోప‌ణ‌ల కింద ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను శిక్షించాల‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. హేగ్‌లోని అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ కోర్టులో ఆయ‌న  మాట్లాడారు. ర‌ష్యా యుద్ధ నేరాల‌కు పాల్ప‌డుతోంద‌ని, ఆ కేసుల్ని ప‌రిష్క‌రించేందుకు వార్ ట్రిబ్యున‌ల్‌ ను ఏర్పాటు చేయాల‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ కోరారు. దూకుడుత‌త్వంతో నిర్వ‌హించే యుద్ధాల‌ను ఆప‌లేమ‌ని, కానీ క్రిమిన‌ల్ ఐడియాతో సాగిస్తున్న యుద్ధాన్ని ఆప‌వ‌చ్చు అని ఆయ‌న అన్నారు. ఆయుధ బ‌ల‌గాల‌తోనే యుద్ధాన్ని గెల‌వ‌గ‌ల‌మ‌ని, ఉక్రెయిన్‌కు ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసిన నెద‌ర్లాండ్స్‌కు ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు. పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ ప్ర‌య‌త్నించిన‌ట్లు ర‌ష్యా ఆరోపిస్తోంది. ర‌ష్యా అధ్య‌క్ష భ‌వ‌నం క్రెమ్లిన్‌పై తాజాగా డ్రోన్ అటాక్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ దాడి వెనుక అమెరికా హ‌స్తం ఉంద‌ని ర‌ష్యా ఆరోపిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events