Namaste NRI

మత్తుగా మత్తుగా విక్రమ్‌ వీడియో సాంగ్‌

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విక్రమ్‌. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తున్నది. ఈ సినిమా ఫస్ట్‌సింగిల్‌ మత్తు మత్తుగా లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరపరచిన ఈ గీతానికి చంద్రబోస్‌ సాహిత్యాన్నందించారు. మత్తుగా మత్తుగా మగువ మత్తుగా.. మందు మత్తుగా లేనే లేదేంట్రా.. కొత్త బీట్‌ను కొట్టండ్రా అంటూ పక్కా మాస్‌ శైలిలో హుషారెత్తించేలా ఈ పాట సాగింది. కమల్‌ హాసన్‌ చేసిన నృత్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటను ఆయనే స్వయంగా ఆలపించడం విశేషం. గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాళిదాస్‌ జయరామ్‌, నరేన్‌, అర్జుణ్‌దాస్‌, శివాని నారాయణన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, నిర్మాణ సంస్థ: రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌. స్టార్‌ హీరో నితిన్‌ హోమ్‌ బ్యానర్‌ శ్రేష్ట్‌ మూవీస్‌ ఈ చిత్రాన్ని  తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది. జూన్‌ 3న విక్రమ్‌ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events