Skip to main content

Namaste NRI

ఇరాన్ మహిళా నేత నర్గెస్‌కు నోబెల్ శాంతి

ఇరాన్ హక్కుల ఉద్యమనాయకురాలు నర్గేస్ మెహమ్మది నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఇరాన్‌లో ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తోన్న నర్గేస్ తరఫున ఈ పురస్కారాన్ని ఆమె పిల్లలు స్వీకరించారు. ఇరాన్‌లో మహిళల హక్కుల, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆమె పాటుపడుతూ వచ్చారు. ఆమెపై మరణశిక్ష తీర్పు కూడా వెలువడింది. 51 సంవత్సరాల నర్గేస్‌ను నోబెల్ శాంతి బహుమతికి నోబెల్ కమిటీ అక్టోబర్‌లో ఎంపిక చేసి ఆమె  పేరు ప్రకటించింది. జైలులో ఇరాన్ నిర్బంధంలోని ఆమె రావడానికి కుదరని పరిస్థితిలో ఆమె తరఫున 17 సంవత్సరాల కవలం పిల్లలు దీనిని అందుకున్నారు.

పురస్కారాన్ని తాము ఆమోదిస్తున్నట్లు తెలిపారు. వీరు పారిస్‌లో తమ సమీప బంధువుల వద్ద ప్రవాసంలో ఉంటున్నారు. ఈ నోబెల్ బహుకరణ నేపధ్యంలో జైలులో ఉన్న తల్లి ప్రకటన వెలువరించారు. అంతర్జాతీయ మీడియా సముచిత రీతిలో కీలక పాత్ర పోషించిందని, ఇరాన్ హక్కుల పరిరక్షణోద్యమానికి సరైన రీతిలో ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. తాము తిరిగి తల్లిని కలుస్తామనే నమ్మకం తమకు లేదని పురస్కారం అందుకున్న కవలలు భావోద్వేగానికి లోనయ్యారు.

ఇరాన్‌లో పుట్టిన నర్గెస్ విద్యార్థినిగా ఉన్ననాటి నుంచే మహిళా హక్కులపై గళమెత్తారు. ఇంజనీరింగ్ చదివిన ఆమె కొంతకాలం పత్రికలకు కాలమిస్టుగా ఉన్నారు. నోబెల్ శాంతి పురస్కార విజేత షిరిన్ స్థాపించిన డిఫెండర్స్ ఆప్ హ్యుమన్ రైట్స్ (డిహెచ్‌ఆర్‌సి) సెంటర్‌లో 2003లో చేరారు. తరువాత ఈ సంస్థకు ఉపాధ్యక్షురాలు అయ్యారు. జైల్లో ఉన్నప్పుడు కూడా తన ఉద్యమాలను సాగించిన నార్గిస్ ప్రత్యేకించి జైళ్లల్లో మహిళా ఖైదీల పట్ల లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరుసల్పారు. జైలులోనూ ఆమెపై పలురకాల ఆంక్షలు విధించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events