ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమేనా? అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. జన ఆశీర్వాదయాత్రలో భాగంగా కోదాడలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మరికొన్ని రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ అద్వానంగా తయారవుతుందన్నారు. సీఎం కూర్చీ, కుటుంబం కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారు. కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరముందన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిరదని విమర్శించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మండిపడ్డారు.
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడిరచేందుకు కేసీఆర్ అనేక కుట్రలు పన్నుతున్నారు. కేసీఆర్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈటల ఒక వ్యక్తి కాదు కోట్లాది మంది బీజేపీ కార్యకర్తల అండ ఉందన్నారు.. నరేంద్ర మోదీకి ఎన్నికలప్పుడే పార్టీలు అభివృద్ధిలో కాదన్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రధాని ఉచిత బియ్యం అందిస్తున్నారు. ప్రతి కేజీ బియ్యానికి కేంద్రం 37 రూపాయలు చెల్లిస్తుందని తెలిపారు.