మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లను డెమొక్రాట్లు ఎదుర్కొన్న తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బైడెన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, ఎంపిక చేసుకొనే హక్కును కాపాడుకోవాలని అమెరికా ప్రజలు ఈ ఎన్నికల్లో స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు డెమోక్రాట్లకు భారీగా నష్టం కలుగుతుందని చాలా మంది అంచనాలు వేశారని, చివరకు తన ఆశావాదమే నెగ్గిందని తెలిపారు. ఈ సందర్భంగా 2024 అధ్యక్ష పదవి రేసులో కొనసాగుతానన్న సంకేతాన్ని బైడెన్ ఇచ్చారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.














