Skip to main content

Namaste NRI

ఇది సినిమా కాదు జీవితం : రాజేంద్రప్రసాద్‌

రాజేంద్రప్రసాద్‌.  ప్రధాన పాత్రలో అర్చనతో కలిసి నటించిన చిత్రం షష్టిపూర్తి. రూపేష్‌, ఆకాంక్షసింగ్‌ జంటగా నటించారు. పవన్‌ప్రభ దర్శకుడు. రూపేష్‌ చౌదరి నిర్మాత. బుధవారం చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఇది సినిమా కాదు జీవితం. తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం అన్నారు.  తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించే గొప్ప కథ ఇది. మన ఇంటిలో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనే అంశాలను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. అందరూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే సినిమా అన్నారు.

 చాలా కాలం విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడం ఆనందంగా ఉందని, ఇళయరాజా, తోట తరణి వంటి లెజెండ్స్‌ పనిచేయడం ఈ సినిమా స్థాయి ఏమిటో చెబుతుందని అర్చన అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మంచి విలువలతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇళయరాజాగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడంతో నిజంగా నా జన్మ ధన్యమైంది అన్నారు. చక్కటి కుటుంబ కథతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని రూపేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News