Namaste NRI

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తరపు ఎవరిని బరిలోకి దింపుతారన్న ఉత్కంఠకు తెరపడిరది. ఉప రాష్ట్రపతి అభ్యరిగా జగదీప్‌ ధన్కర్‌ను బరిలోకి దింపింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా పని చేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర  హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, పార్లమెంటరీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్డీయే తరపున జగ్‌దీప్‌ ధన్కర్‌ను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేర్లలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరు ప్రస్తావనకు రానప్పటికీ అనూహ్యంగా ఆయన్ను ప్రకటించడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events