Skip to main content

Namaste NRI

జాహ్నవి మృతి కేసు.. అమెరికా తీరుపై భారత్‌ అసంతృప్తి!

అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీ క్షించాలని సియాటెల్ భారత రాయబార కార్యాలయం కోరింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్ లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందిం ది. సాక్షాధారాలు లేకపోవడంతో డవేపై అభియోగాలు మోపడం లేదని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం రెండు రోజుల క్రితం ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది.

అయితే ఈ కేసు గురించి స్థానిక అధికారులు, సియాటెల్ పోలీస్‌ల వద్ద గట్టిగా లేవనెత్మాని, సమీక్ష కోసం ప్రస్తుతం ఈ కేసును సియాటెల్ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేసిన తరువాత దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నామని సియాటెల్ భారత కార్యాలయం వెల్లడించింది. జాహ్నకి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events