Skip to main content

Namaste NRI

షూటింగ్ పూర్తి చేసుకున్న జైలర్ – రిలీజ్ ఎప్పుడంటే

 తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నటిస్తోన్న మోస్ట్‌ అవెయిటెడ్‌ ప్రాజెక్టుల్లో ఒకటి జైలర్. యాక్షన్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్నారు.  మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, టాలీవుడ్ యాక్టర్‌ సునీల్‌, తమన్నా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్‌ రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా తలైవా టీం నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. జైలర్‌ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్స్‌లో రజినీకాంత్‌, నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, తమన్నా అండ్ టీం కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. రజినీకాంత్‌ జైలర్‌గా ఆగస్టు 10న వేట షురూ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అప్డేట్ అందించారు. జైలర్‌ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన మోహన్‌ లాల్‌, సునీల్‌, తమన్నా పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. జైలర్‌ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News