అమెరికాలో గ్రీన్ కార్డుల మంజూరు విధానంలో అసాధారణ జాప్యాలను అధ్యక్షుడు జో బైడెన్ నివారించాలనుకుంటున్నట్లు శ్వేతసౌధం వెల్లడిరచింది. ఇదే జరిగితే హెచ్ 1 బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు ఎంతో మేలు చేకూరుతుంది. అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరుకు ప్రస్తుతం అమల్లో ఉన్న దేశానికి 7 శాతం కోటా విధానం వల్ల అసాధారణ జాప్యాలు ఎదురవుతుండటంతో భారతీయ ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల సమస్యలను ఎదుర్కొంటున్న ఇండియన్` అమెరికన్లు, వారి పిల్లల విషయాలు అత్యంత కీలకమైనవని వైట్ హౌజ్ ప్రెస్ కార్యదర్శి జేక్ సాకి పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో జరుగుతున్న జాప్యంపై బైడెన్ మాట్లాడాలని కోరుకుంటున్నారని అన్నారు.














