Skip to main content

Namaste NRI

జో బైడెన్ కీలక నిర్ణయం… తాలిబన్లకు మరో షాక్

అఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న బాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 9.5 బిలియన్‌ డాలర్ల ఆఫ్ఘన్‌ ద్రవ్య నిల్వలను స్తంభింపజేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో ఈ చర్య చేపట్టారు. తాలిబన్ల దూకుడుడు బైడెన్‌ సర్కార్‌ బ్రేకులు వేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాంకుకు చెందిన సుమారు 9.5 బిలియన్‌ డాలర్ల నిధులను తాలిబన్లు యాక్సెస్‌ చేయకుండా, ఆ దేశానికి బదిలీ కాకుండా నిరోధించారు. యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ ఎల్‌ యెల్లెన్‌, ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిస్‌ అసెట్స్‌ కంట్రోల్‌ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా బ్యాంకుల్లో ఉన్న ఆఫ్ఘన్‌ ప్రభుత్వ  ద్రవ్య నిల్వలను స్తంభింపజేయాలని ఆదేశించారు.

Social Share Spread Message

Latest News