Skip to main content

Namaste NRI

సత్యభామగా కాజల్‌ అగర్వాల్‌

కాజల్‌ అగర్వాల్‌ కొత్త సినిమా అప్‌డేట్‌తో అభిమానులకు ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సత్యభామ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్‌. క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శశి కిరణ్‌ టిక్కా నిర్మిస్తుండగా,  అఖిల్ డేగల డైరెక్ట్ చేస్తున్నాడు. పవర్‌ ఫుల్‌ టైటిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా సెల్‌లోకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన కాజల్‌ నిందితుల నుంచి నిజాన్ని రాబట్టేందుకు తన పంచ్ పవర్‌ ఏంటో చూపిస్తోంది. ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో సినిమా ఉండబోతుందని గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. భయంతో పరిచయం లేని పోలీసాఫీసర్‌ సత్యభామ ప్రపంచంలోకి ఆరం ఆర్ట్స్  మిమ్మల్ని గర్వంగా ఆహ్వానిస్తోంది అంటూ లాంఛ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. 
Social Share Spread Message

Latest News