కమల్‌హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వలో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల పతళ పతళ అంటూ సాగే పాటని విడుదల చేశారు. తమిళంలో ఆ పాటని కమల్ హాన్ స్వయంగా రచిండడంతో పాటు, ఆలపించారు. పాటలో కమల్‌హాసన్ నృత్యాలు అలరించాయి. ఆయనే మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 3న పలు భాషల్లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అనిరుధ్ సంగీతమందించారు. ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 15న విడుదల చేస్తారు. కాళిదాస్, జయరామ్, నరైన్, అర్జున్‌దాస్, శివాని నారాయణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరిష్ గంగాధరన్, నిర్మాతలు: కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకత్వం: లోకేష్ కనకరాజ్.














