Skip to main content

Namaste NRI

కమల్‌.. విక్రమ్‌ ప్రీ రిలీజ్‌ వేడుక

కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, షాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విక్రమ్‌. ఈ నెల 3న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. విక్రమ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్‌ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమల్‌ హాసన్‌ మరో చరిత్ర సినిమా ప్రతి నటుడికీ గైడ్‌ లాంటిది. దశావతారం లాంటి సినిమా చేసేందుకు ఇప్పుడున్న ఏ నటుడికీ ధైర్యం చాలదు. ఏక్‌ దూజే కేలియే తో మొదటి పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. ఇవాళ గ్లోబల్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్నారు. మూసను రూపుమాపిన నటుడు ఆయన. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది అన్నారు. కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించాను. యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ చిత్రమిది ప్రంతి పాత్ర హీరోలాగే అనిపిస్తుంది. ఇదొక చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్నా. విడుదలకు ముందే ఈ మాట చెప్పే ధైర్యం నాకు తెలుగు ప్రేక్షకులే ఇచ్చారు. నేను నటడిగా సాధించిన ఏ ఘనతా నా ఒక్కడిది కాదు. మనవి పాన్‌ ఇండియా కాదు పాన్‌ వరల్డ్‌ సినిమాలు కావాలి అన్నారు. హీరో నితిన్‌ మాట్లాడుతూ భారతీయ సినిమాకు కమల్‌ హాసన్‌ గర్వకారణం. ఆయన సినిమాలో తెలుగులో విడుదల చేసే అవకాశం రావడం సంతోషంగా  ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు లోకేష్‌ కనకరాజ్‌, హరిష్‌ శంకర్‌, బుచ్చిబాబు, వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News