Namaste NRI

కంచుకోట టైటిల్‌ లాంచ్‌

మదన్‌, ఆశ, దివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కంచుకోట. ఆర్కే ఫిలింస్‌ పతాకంపై ప్రతాని రామకృస్ణ గౌడ్‌ ముఖ్య పాత్రలో నటిస్తూ నిర్మాస్తున్నారు.   ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర టైటిల్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ  ఇదొక చారిత్రక నేపథ్య సినిమా. 40 శాతం గ్రాఫిక్స్‌ ఉంటాయి. హీరో రాజశేఖర్‌ మేనల్లుడు మదన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రంలో నేను గురూజీ పాత్రలో నటించాను. గాయని మంగ్లీ పాడిన ఒక పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం. కంచుకోటలా మా సినిమా విజయవంతం సాధించాలని మా బృందం కృషి చేస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.  ఈ చిత్రంలో బ్రహ్మానందం. పృథ్వీ, సత్యప్రకాష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎంఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, నిర్మాతలు ఏ.గురురాజ్‌, మోహన్‌ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events