Skip to main content

Namaste NRI

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్..ఎమర్జెన్సీ ట్రైలర్ వచ్చేసింది

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌   స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 17న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ  విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో భార‌త ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోన్నారు. మీడియా ఎలా అణ‌చివే య‌బ‌డింది. వంటి యదార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్‌, మణికర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్‌, శ్రేయాస్‌ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం గ‌తేడాది ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉండ‌గా,  అనుకోని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events