Skip to main content

Namaste NRI

జైలర్ నుంచి కావాలా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ రజినీకాంత్‌ నటిస్తున్న చిత్రం  జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్‌  డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్నారు.  మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా  ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం జైలర్‌ ఫస్ట్‌ సింగిల్ కావాలా సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌.తమన్నా హాట్‌ హాట్‌ స్టెప్పులతో మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని తాజా సాంగ్‌ చెబుతోంది.తమన్నాతో తలైవా కూడా స్టైలిష్‌ స్టెప్పులేసి అదరగొట్టేయబోతున్నాడని లిరికల్ వీడియో సాంగ్‌తో అర్థమవుతోంది.

 

జైలర్‌ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, సునీల్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే జైలర్‌ నుంచి మేకర్స్‌ విడుదల చేసిన మోహన్‌ లాల్‌, సునీల్‌, తమన్నా లుక్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న జైలర్‌ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ మూవీని ఆగస్టు 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News