Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియాలో కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌ పోటీలు

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయ క్రీడాకారులతో ఆగస్టులో కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ దేశ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి, విక్టోరియా రాష్ట్ర కన్వీనర్‌ ఉప్పు సాయిరాం తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌ పార్టీగా మారిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం, సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధిని గురించి తెలియజేయడంతో పాటు కేసీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి సరైన మాధ్యమంగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఎన్నుకునామని తెలిపారు. పార్టీకి ఆస్ట్రేలియాలో మద్దతు కూడగట్టడంతో పాటు ప్రవాస క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో ఈ పోటీలు జరుపుతున్నామన్నారు.  ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలంగాణసహా 28 రాష్ట్రాల ప్రవాస భారతీయ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ముక్త భారత్ దిశగా ప్రజల ఆలోచన ఉందని, ఇది కేసీఆర్ ద్వారానే సాధ్యమని దేశ ప్రజలు నమ్ముతున్నారని విక్టోరియా స్టేట్ కన్వీనర్ ఉప్పు సాయిరాం తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events