Skip to main content

Namaste NRI

కీడా కోలా ని ప్రేక్షకులు ఆదరిస్తారు : రానా

తరుణ్‌ భాస్కర్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం కీడా కోలా. ఈ చిత్రానికి కె.వివేక్‌ సుదాంశు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మాతలు. బ్రహ్మానందం, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌కుమార్‌ విష్ణు, చైతన్యరావు మదాడి, రాగ్‌ మయూర్‌ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం థియేట్రిక ల్‌ ట్రైలర్‌ని  ప్రముఖ హీరో రానా దగ్గుబాటి లాంచ్‌ చేశారు. రానా మాట్లాడుతూ కథని బలంగానమ్మి, కథకు కట్టుబడి సినిమాలు తీసే టెక్నీషియన్‌ తరుణ్‌ భాస్కర్‌. సినిమా చూశాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. నవంబర్‌ 3న సినిమాను విడుదల చేస్తున్నాం  అని చెప్పారు.

తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ  క్రైమ్‌ కామెడీ నాకు ఇష్టమైన జానర్‌. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ట్రై చేయలేదు. కీడా కోలా కథ రాస్తున్నప్పుడు ఈ జానర్‌ ఎంత కష్టమైందో అర్థమైంది. అయినా సరే ఎంజాయ్‌ చేస్తూ పనిచేశాం అన్నారు.  నా మొదటి రెండు సినిమాల విడుదలకు ముందు కొంచెం నెర్వస్‌నెస్‌ వుండేది. ఈ సినిమా విషయంలో మాత్రం కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ఇప్పటికి సినిమా పదిసార్లు చూశాను. అన్ని వయసులవారూ ఎంజాయ్‌చేసేలా వచ్చింది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events