Skip to main content

Namaste NRI

ఇళయరాజా సంగీతంలో కీరవాణి పాట – ఏ సినిమా కోసమో తెలుసా?

రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం షష్టిపూర్తి. క్లాసిక్‌ ఫిల్మ్‌ లేడీస్‌ టైలర్‌  విడుదలైన 38ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడ విశేషం. ఇందులో రూపేష్‌, ఆకాంక్షసింగ్‌ నాయకానాయికలుగా నటిస్తున్నారు. పవన్‌ప్రభ దర్శకుడు. ఈ సినిమాలోని ఏదో ఏ జన్మలోదో  అనే గీతాన్ని త్వరలో విడుదల చేయబోతు న్నారు. ఇళయరాజా స్వరపరచిన ఈ గీతానికి కీరవాణి సాహిత్యాన్ని సమకూర్చడం విశేషం. దర్శకుడు ఈ పాట విశేషా లు తెలియజేస్తూ ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి. అందులో ఓ పాటను కీరవాణితో రాయిస్తే బాగుంటుందనుకు న్నాం. సందర్భం చెప్పి రాయమని రిక్వెస్ట్‌ చేయగా ఆయన అంగీకరించారు. ఇసైజ్ఞాని ఇళయరాజా బాణీకి ఆస్కార్‌ విజేత ఎం.ఎం.కీరవాణి సాహిత్యాన్ని అందించడం, అది మా సినిమాలో పాట కావడం ఆనందంగా ఉంది. కీరవాణి ఇప్పటివరకు ఎన్నో పాటలు రాశారు, కానీ ఇళయరాజా బాణీకి రాయడం ఇదే ప్రథమం. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాల్లో ఉంది అన్నారు. అచ్యుత్‌ కుమార్‌, సంజయ్‌ స్వరూప్‌, రాజ్‌ తిరందాసు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, నిర్మాత: రూపేష్‌ కుమార్‌ చౌదరి.

Social Share Spread Message

Latest News