రిపబ్లిన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనెటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికపై డొనాల్డ్ ట్రంప్ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఆయనను తప్పించి, ఆ స్థానంలో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థినిగా భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నాడట. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉండగా, ఆయనకు సలహాదారుగా పనిచేసిన పాల్ బీగ్లా ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ స్థానంలో కమలా హారిస్ రావటంతో ట్రంప్ ఆలోచనలు మారినట్టు సమాచారం.