Skip to main content

Namaste NRI

కెనడా ప్రధాని కీలక నిర్ణయం..తక్షణమే అమలులోకి

కెనడాలో ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ ప్రకటించారు. తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ట్రక్కు డ్రైవర్లు వ్యతిరేకిస్తూ  తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. పరిస్థితి కూడా విషమించింది. దీంతో దేశంలో ఎమర్జెన్సీని విధించాని ప్రధాని నిర్ణయించారు. ఈ నిర్ణయం తక్షణమే అములోకి వస్తుందని, 30 రోజుల పాటు అమలులో వుంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఎంత మాత్రమా ఆమోదయోగ్యం కావని అన్నారు. చట్ట వ్యతిరేకమైన, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే మాత్రం చూస్తూ ఊరుకోమని అన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే మాత్రం తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. ఒకవేళ ట్రక్కులతో ఇలాగే నిరసనలకు దిగితే మాత్రం వారి వారి కార్పొరేట్‌ అకౌంట్లను నిషేధిస్తామని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News