Skip to main content

Namaste NRI

భారతీయ అమెరికన్ కు కీలక పదవి.. వైట్‌హౌస్‌లో

అమెరికా మరో భారత సంతతి వ్యక్తికి ఉన్నత పదవి కట్టబెట్టి గౌరవించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహాయకురాలుగా పరిగణిస్తున్న భారత సంతతి పాలసీ నిపుణురాలు నీరా టాండ్‌ను వైట్‌హౌస్‌ స్టాఫ్‌ సెక్రటరీగా నియమించారు. తెరవెనుక పనిచేసే స్టాఫ్‌ సెక్రటరీకి వైట్‌హౌస్‌ వెస్ట్‌ వింగ్‌లో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఇక్కడి నుంచే ప్రభుత్వ పరిపాలన విభాగాల ఫైళ్లు అధ్యక్షుడికి చేరుతాయి. స్టాఫ్‌ సెక్రటరీని వైట్‌ హౌస్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ నియామకానికి సెనేట్‌ ఆమోదం అవసరం లేదు. వైట్‌హౌస్‌ స్టాఫ్‌ సెక్రటరీగా నియమితులైన నీరా టాండన్‌ ప్రత్యేక ప్రాజెక్టులు, కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారని వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆమె వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రాన్‌ క్లైన్‌కు రిపోర్ట్‌ చేయనున్నది.

                కాగా ప్రస్తుతం నీరా టాండన్‌ అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిదే. అంతకుమందు యూఎస్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ సీనియర్‌ అడ్వైజర్‌గానూ విధులు నిర్వర్తించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా సర్కార్‌ తీసుకొచ్చిన అఫర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌ విధివిధానాలను ఖరారు చేయడానికి అమెరికా పార్లమెంట్‌తో కలిసి పనిచేశారు. ఒబామా, బైడెన్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు వారి తరపున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

Social Share Spread Message

Latest News