Skip to main content

Namaste NRI

ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక సంస్కరణలు… హెచ్-1బీ వీసా రెండేండ్లకే!

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ పునరుద్ధరణ అంశంపై విచారణ చేపట్టిన యూఎస్ హౌజ్ కమిటీకి సెంటర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్కు చెందిన జెస్సికా ఎం వాఘన్ కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికా కంపెనీల్లో పని చేసేందుకు మూడేండ్ల కాలపరిమితితో ఇస్తున్న హెచ్-1బీ వీసాలను రెండేండ్లకే ఇవ్వాలని, అవసరమైతే నాలుగేండ్ల కాలానికి మాత్రమే పొడిగించే అవకాశం కల్పించాలని ఆమె సూచించారు.
గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారనే కారణంతో ఆటోమేటిక్గా హెచ్-1బీ వీసాను పొడిగించే విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించారు. హెచ్-1బీ వీసాల సంఖ్యను సైతం 75 వేలకే పరిమితం చేయాలని సూచించారు. విద్యార్థి వీసాలపై(ఎఫ్-1, ఎం-1) అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల నుంచి చదువు పూర్తయిన తర్వాత తిరిగి సొంత దేశాలకు వెళ్తామనే సమ్మతిని తీసుకోవాలని ప్రతిపాదించారు. విదేశీయులకు వర్క్ వీసాలు ఇవ్వడం వల్ల అమెరికన్లు నిరుద్యోగులుగా మారుతున్నారని, స్టాఫింగ్ కంపెనీలు విదేశీయులకు వర్క్ వీసాలు స్పాన్సర్ చేయడానికి అనుమతించొద్దని సూచించారు.

Social Share Spread Message

Latest News