Skip to main content

Namaste NRI

కిమ్ జాంగ్ ఉన్ ప్రత్యక్షం… ఆశ్యర్యపోయిన అధికారులు

రీసెంట్ గా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కనిపించట్లేదనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టారు కిమ్. కిమ్ ఓ మిలిటరీ విందులో పాల్గొన్నారు. చాలా గ్రాండ్‌గా  జరిగిన ఆ వేడుకకు కూతురు, భార్యతో కలిసి వచ్చారు. చాలా విలాసవంతంగా జరిగిన బాంక్వెట్‌కు  ఫ్యామిలీలో కిమ్ రావడం అందర్నీ స్టన్ చేసింది. కిమ్‌తో  విందులో పాల్గొన్న ఆ అమ్మాయి పేరు జూ యే. ఆమె వయసు తొమ్మిదేళ్లు. కిమ్ తర్వాత ఆ దేశ వారసురాలు ఆమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భార్య రీ సోల్ జూ కూడా విందులో పాల్గొనడం విశేషం. కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. కూతురుతో కలిసి కిమ్ విందుకు హాజరుకావడం మిలిటరీ అధికారుల్ని ఆశ్చర్యానికి గురి  చేసినట్లయింది. బాంక్వెట్‌లో  టేబుల్ సెంటర్ సీటులో కిమ్ తన కూతుర్ని కూర్చోబెట్టారు. మిలిటరీ ఈవెంట్‌కు  కూతుర్ని తీసుకువచ్చిన రాచరిక పాలన సంకేతాల్ని కిమ్ ఇచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events