కువైత్ తాజాగా మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. వర్క్ పర్మిట్లను విద్యార్హతను బట్టి కేటాయించనున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (పీఏఎం) వెల్లడిరచింది. ఇలా విద్యార్హతను బట్టి ఉద్యోగాలను 1,855 రకాలుగా విభజించింది. అలాగే ఆయా ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను పెట్టింది. ఈ మేరకు పీఏఎం తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక సెక్షన్‌ను పొందుపరిచింది. కనుక ఈ కొత్త క్యాలిఫికేషన్ లింకింగ్ పద్దతిలో అభ్యర్థి సమర్పించే విద్యార్హత జాబ్ టైటిల్‌కు సరిపోతేనే వారికి వర్క్ పర్మిట్ జారీ లేదా రెన్యువల్ చేయడం జరుగుతుంది.