Skip to main content

Namaste NRI

మిజోరం సీఎంగా లాల్‌దుహోమా ప్రమాణస్వీకారం

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) నాయకుడు లాల్‌దుహోమా ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సీఎం లాల్‌దుహోమా, ఇతర మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. 73 ఏండ్ల లాల్‌దుహోమాతోపాటు మరో11 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఏడుగురికి క్యాబినెట్‌ హోదా దక్కగా, నలుగురికి సహాయ మంత్రిత్వంతో సరిపుచ్చారు. తాజా ఎన్నికల్లో ఓటమి చెందిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) నేత, మాజీ సీఎం జోరంతంగా, మాజీ సీఎం లాల్‌ థాన్‌వాలా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News