Skip to main content

Namaste NRI

తిరుమల శ్రీవారికి భూరి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు భూరీ విరాళం అందించారు. కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్‌ సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలుమైన 3.064 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ధర్మారెడ్డికి బంగారం బిస్కెట్ల విరాళాన్ని అందించారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Social Share Spread Message

Latest News