Skip to main content

Namaste NRI

లవ్‌ యూ రామ్‌ నుంచి మనసు మాట వినదే

రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్ధన్‌ జంటగా నటిస్తున్న చిత్రం లవ్‌ యూ రామ్‌. డి.వై. చౌదరి దర్శకుడు. శ్రీచక్ర ఫిలింస్‌ పతాకంపై కె.దశరథ్‌, డి. వై చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మనసు మాట వినదే అనే గీతాన్ని అగ్ర నటుడు నాగార్జున విడుదల చేశారు. కె.వేద స్వరపరచిన ఈ పాటకు వరికుప్పల యాదగిరి సాహిత్యాన్ని అందించారు. దివ్యమాలిక ఆలపించారు.

ప్రేమలోని సున్నితమైన భావాల్ని అందంగా ఆవిష్కరిస్తూ సాగిందీ గీతం. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సీనియర్‌ దర్శకుడు దశరథ్‌ కథనందిస్తున్నారు. వినూత్న ప్రేమకథగా అందరిని ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్‌, సంగీతం: కె.వేద, సంభాషణలు: ప్రవీణ్‌వర్మ, దర్శకత్వం: డీవై చౌదరి.

Social Share Spread Message

Latest News