Skip to main content

Namaste NRI

విష్ణు విశాల్ ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్ రిలీజ్

విష్ణు విశాల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఆర్యన్‌. ప్రవీణ్‌ కె. దర్శకుడు. శుభ్రా, ఆర్యన్‌ రమేష్‌ నిర్మాతలు. ప్రచారం లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్‌ విడుదల చేశారు. పరిచయమే అంటూ సాగే ఈ ప్రేమగీతాన్ని సామ్రాట్‌ రాయగా, జిబ్రాన్‌ స్వరపరిచి, అభి.వి, భృత్త లతో కలిసి ఆలపించారు. హీరో హీరోయిన్ల ప్రేమప్రయాణాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగింది. విష్ణు విశాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన చిత్రంలో సెల్వరాఘవన్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, మానస చౌదరి కీలక పాత్రధారులు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది.   ఈ చిత్రానికి కెమెరా: హరీశ్‌ కన్నన్‌, నిర్మాణం: విష్ణు విశాల్‌ స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News