శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం లవ్‌స్టోరీ. కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 16న న విడుదల చేయాలనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిరది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాలోని సారంగధరియా పాట ఎంతో ప్రేక్షదారణ పొందింది. యూట్యూబ్‌లో ఈ పాటకు ఎన్నో మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.