Namaste NRI

మాచర్ల నియోజకవర్గం షూటింగ్‌ పూర్తి

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. నితిన్‌, కృతిశెట్టి జోడీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. వారిద్దరి ప్రేమాయణం ఆసక్తిగా సాగుతుంది. మరో నాయికగా కేథరిన్‌ నటిస్తున్నది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్యాలెన్స్‌గా ఉన్న పాటను త్వరలో తెరకెక్కిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ నితిన్‌, కృతిశెట్టి లుక్‌ విడుదల చేశారు.  ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 12న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్‌, సంభాషణలు: మామిడాల మారుతి, సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, రచన`దర్శకత్వం: ఎం.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events