Skip to main content

Namaste NRI

మహారాజ వస్తున్నాడు

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మహారాజ. నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం.  ఈ సినిమాలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల హక్కులను ఎన్‌వీఆర్‌ సినిమా దక్కించుకుంది. భారీ స్థాయిలో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.ఓ సాధారణ వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే చిత్ర కథాంశమని, విజయ్‌ సేతుపతి పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తాడని చిత్ర బృందం పేర్కొంది. మమతా మోహన్‌ దాస్‌, నటరాజ్‌, భారతీరాజా తదితరులు నటిస్తున్నారు.  ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌ పురుషోత్తమన్‌, సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, నిర్మాతలు: సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనిసామి, రచన-దర్శకత్వం: నితిలన్‌ స్వామినాథన్‌.

Social Share Spread Message

Latest News