Skip to main content

Namaste NRI

మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్ పోటీల్లో మహతి కౌమారి

మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్ 2023 పోటీల్లో తెలంగాణ
బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. ఈ అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన మహతి కౌమారి మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సి వరల్డ్ లో 2వ స్థానం దక్కించుకుంది. ఈ మేరకు జూన్ 4 నుండి 10 వరకు జరిగిన అందాల పోటీల్లో ఆమె భారతదేశం తరఫున పోటీల్లో పాల్గొంది.మలేషియా దక్షిణాఫ్రికా సహా 15 దేశాల నుండి సుమారు 45 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో పోటీ రాగా మహతి కౌమారి 2వ రన్నరప్‌గా గెలుపొందారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహతి కౌమారి మాట్లాడుతూ తెలంగాణ బిడ్డగా తనకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 2వ రన్నరప్‌గా నిలిచి మన రాష్ట్రానికి కాకుండా దేశానికి పేరు తెచ్చినట్లయిందన్నారు. అందాల పోటీల విషయంలో భవిష్యత్తులో తెలంగాణకు మరింత మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఓ తెలుగు కుటుంబానికి చెందిన తాను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించనని, ఉద్యోగ పరంగా పదేళ్ల పాటు బహుళజాతి సంస్థల్లో పనిచేసిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్నానన్నారు.

Social Share Spread Message

Latest News