Skip to main content

Namaste NRI

శశికాంత్‌ వల్లేపల్లి సహకారంతో 700 మందికి వైద్యసేవలు

వల్లేపల్లి శశికాంత్‌,  ఆయన సతీమణి ప్రియాంక సహకారంతో హైదరాబాద్‌లో తానా, సీసీసీ, స్వేచ్ఛ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితా మెగా వైద్య శిబిరం నిర్వహించారు.  700 మందికి పైగా ఈ శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మెగా వైద్యశిబిరాలకు వస్తున్న స్పందన, స్వేచ్ఛ వాలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి శశికాంత్‌ వల్లేపల్లి అందరికీ అభినందనలు తెలియజేశారు.

ఈ క్యాంప్‌‌కు హైదరాబాద్‌లో  గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్‌ నుంచి దాదాపు 7 వందలమంది హాజరయ్యారు. వీరికి 13 మంది వైద్యులు కన్సల్టెన్సీ సేవలు అందించారు. హాజరైన పేషెంట్లు అందరికీ ఫ్రూట్స్‌, పులిహోర పంపిణీ చేశారు. స్వేచ్ఛ తరపున సాఫ్ట్‌‌వేర్‌ ఇంజనీర్లు, బీటెక్‌ విద్యార్థులు, బ్యాంక్‌ ఉద్యోగులు ఇతర మేధావులు వాలంటీర్లుగా హాజరై సేవలు అందించారు. సీసీసీ ప్రెసిడెంట్‌ చక్రధర్‌ మొత్తం క్యాంప్‌‌ను పరిశీలించి, స్వేచ్ఛ వారిని అభినందించారు. తాము కూడా ఇందులో భాగస్వాములైనందుకు గర్వపడుతున్నామని అన్నారు.

ఈ మెడికల్‌ క్యాంప్‌ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్‌ పద్ధతిలో హాజరవుతుంటారని తెలిపారు. ఆర్థోపెడిక్‌, డయాబెటీక్‌, గైనకాలజీ, పీడీయాట్రిషన్‌ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ క్యాంప్‌‌లో రెగ్యులర్‌‌గా కళ్లకు సంబంధించిన స్పెషలిస్ట్‌ సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 140 మంది పేషెంట్లకు కాటరాక్ట్‌ ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. వందలాదిమందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించారు.

 విజయవంతంగా ఈ వైద్యశిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా నాయకులు నిరంజన్‌ శృంగవరపు, అంజయ్య చౌదరి లావు, వెంకటరమణ యార్లగడ్డ అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events