Namaste NRI

ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన సినిమా మీటర్‌.  అతుల్య రవి నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మించారు. రమేష్‌ కాదూరి దర్శకుడు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో  నిర్మాత చెర్రీ మాట్లాడుతూ దర్శకుడు రమేష్‌ ఆకట్టుకునేలా చిత్రాన్ని మలిచారు. ఓ మంచి సినిమా చేశామని రేపు ప్రేక్షకులు కూడా చెబుతారు. ఈ చిత్రంతో కిరణ్‌ అబ్బవరం మరో స్థాయికి వెళ్తారు. థియేటర్‌లో మా చిత్రాన్ని చూసి ఆదరించండి అన్నారు. దర్శకుడు రమేష్‌ కాదూరి మాట్లాడుతూ ఈ కథలో వినోదం, భావోద్వేగం రెండూ ఉన్నాయి. ఓ కుటుంబ బాధ్యత తీసుకునే వ్యక్తిగా హీరో పాత్ర మీ అందరికీ నచ్చుతుంది. దిలీప్‌ విజువల్స్‌, జేవీ సెట్స్‌, సూర్య డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. సాయి కార్తీక్‌ మంచి సంగీతాన్ని ఇచ్చారు. థియేటర్‌లో మీరు పెట్టే టికెట్‌ ధరకు రెట్టింపు వినోదాన్ని పొందుతారు  అన్నారు.

హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ మాస్‌ కమర్షియల్‌ ప్రేక్షకులు ఎలాంటి కథను ఇష్టపడతారో మా చిత్రంలో అలాంటి కథ ఉంటుంది. నన్ను కొత్తగా తెరపై చూపించే చిత్రమవుతుంది. ఈ వేసవిలో థియేటర్‌లో విజిల్స్‌ వేసి ఆస్వాదించే సినిమా అని చెప్పగలను. ఓ హిట్‌ సినిమా చేసేందుకు మా టీమ్‌ అంతా శ్రమించింది. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయని అనుకుంటున్నాను.  మాతో పాటు తెరపైకి వస్తున్న రవితేజ చిత్రాన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.  ఈ కార్యక్రమంలో దర్శకులు బుచ్చిబాబు, గోపీచంద్‌ మలినేని, నిర్మాత నవీన్‌ యెర్నేని, నాయిక అతుల్య రవి, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News