Skip to main content

Namaste NRI

ప్రవాసులకు మంత్రి కొప్పుల పిలుపు.. తెలంగాణలో

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని పలు సంస్థలను  ముందుకు రావాలని  రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పనెన్స్ సిటీలో బీఆర్ఎస్  నాయకులు ఆనంద్ రాజ్ గుంటకు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాస వాసులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా  కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి తోడుగా ప్రైవేట్ రంగంలోను యువతకు అమెరికాలోని సంస్థలు సహకరిస్తే మేలు చేకూరుతుందని చెప్పారు.

పదిరోజుల అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి  ఇప్పటికే సాల్ట్ లేక్ సిటీలోని LDS  హ్యుమానిటేరియన్ సెంట్రల్ వేర్‌హౌస్‌ రూట్స్ టెక్‌ను  సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ సభ్యులతోనూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ను శాలువాతో సత్కరించారు.

Social Share Spread Message

Latest News