Skip to main content

Namaste NRI

లైకా ప్రొడక్షన్స్‌ చేతికి మిషన్‌ చాప్టర్‌ 1

అరుణ్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం మిషన్‌ చాప్టర్‌ 1. ఎమీ జాక్సన్‌ కథానాయిక. విజయ్‌ దర్శకుడు. ఎం.రాజశేఖర్‌.ఎస్‌.స్వాతి నిర్మాతలు. నిర్మాతలు మాట్లాడుతూ  మా చిత్రాన్ని లైకా సంస్థ విడుదల చేయడం సంతోషంగా వుంది. విలక్షణమైన సినిమాలను తెరకెక్కించే ప్రతిభ వున్న దర్శకుడు విజయ్‌ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం 70 రోజుల్లోనే మిషన్‌ చాప్టర్‌ 1 చిత్రాన్ని తెరకెక్కించారు. లండన్‌, చెన్నయ్‌ సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరణ జరిపాం. ఎమీ జాక్సన్‌ ఈ చిత్రంలో జైలును సంరక్షించే ఆఫీసర్‌గా కీలక పాత్రను పోషిస్తున్నారు. మలయాళ నటి నిమిషా సజయన్‌ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతుంది. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.జీవీ ప్రకాష్‌ సంగీతం చిత్రానికి మెయిన్‌ హైలైట్‌గా వుంటుంది అన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్‌ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

Social Share Spread Message

Latest News