Namaste NRI

దీపావళికి నవ్వుల టపాసులు పేల్చనున్న మిత్ర మండలి

ప్రియదర్శి, నిహారిక ఎన్‌.ఎం, విష్ణు ఓయ్‌, రాగ్‌ మయూర్‌, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కామెడీ ఎంటైర్టెనర్‌ మిత్రమండలి. కల్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్‌రెడ్డి తీగల కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విజయేందర్‌.ఎస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 16న విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ తెలియజేశారు.

ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. దీపావళికి రెండు రోజుల ముందుగా విడుదల అవుతున్న ఈ చిత్రం థియేటర్లలో నవ్వుల టపాసులు పేల్చనున్నదని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయని, నవ్వుల పండుగకు నమూనాలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్‌ ఎస్‌.జె, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధృవన్‌, సమర్పణ: బన్నీవాస్‌ (బి.వి.వర్క్స్‌), నిర్మాణం సప్త అశ్వ మీడియా వర్క్స్‌, వైరా ఎంటైర్టెన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News